ములుగు: మున్సిపాలిటీ ఆస్తిపన్ను 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.90 లక్షల పన్ను వసూలు కాగా 72 శాతంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించినట్లు ములుగు మున్సిపాలిటీ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీ సిబ్బంది పన్ను వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పన్నుల వసూళ్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ములుగు మున్సిపాలిటీ ఆస్తి పన్ను మొత్తం రూ.1.27 కోట్లు కాగా మార్చి 31వ తేదీ వరకు రూ.90 లక్షలు వసూలు అయినట్లు తెలిపారు. వచ్ఛే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి పన్నులు చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ములుగు పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.


