డీఎస్పీ కిశోర్‌కుమార్
ములుగు రూరల్: వాహనదారుల ప్రమాదాల నివారణకు కంటిచూపు కీలకపాత్ర పోషిస్తుందని డీఎస్పీ కిశోర్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో వైద్యులు వేణుమాదవ్ బృందం 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలను ఉచితంగా అందజేశారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, సీఐ సురేష్‌కుమార్, ములుగు, వెంకటాపురం(ఎం) ఎస్సైలు ఉపేందర్‌రావు, చల్లా రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం క్షౌ రశాలల విద్యుత్ సబ్సిడీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆనందంకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షౌ రశాలల విద్యుత్ బిల్లులు చెల్లించాలని విద్యుత్‌శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో విద్యుత్ సబ్సిడీని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో వృత్తిదారులతో కలిసి విద్యుత్‌శాఖ కార్యాలయాల ముట్టడి చేపడతామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు శరబందం, రామకృష్ణ, సంపత్, సతీష్ పాల్గొన్నారు.


