రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు | - | Sakshi
Sakshi News home page

రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి – గిరివాణి

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియాకు చెందిన హరల్డ్‌ సీబాచర్‌ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

ములుగు: నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో ప్రజావాణి – గిరివాణి (గిరిజన దర్బార్‌) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్‌) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించాలని వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement