ములుగు: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌వీపీ సూర్య చంద్రకళ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్‌ను జడ్జి శనివారం ప్రారంభించి మాట్లాడారు. కక్షి దారులు తమ కేసులను రాజీ కుదుర్చుకుని, ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకుంటే అప్పీల్ ఉండదని, అదే అంతిమ తీర్పు అని వెల్లడించారు. లోక్ అదాలత్‌లో 1,117 పెండింగ్ కేసులు ఉండగా 422 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో 18 ఎమ్‌వీఓపి కేసులు, కాంపిన్సేషన్ రూ.1,15,50,000లు, 128 కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, 7 సైబర్ క్రైమ్ కేసులు, 35 సివిల్ కేసులు, 234 ఎస్‌టీసీ కేసులను ఉన్నాయని తెలిపారు. కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్‌లను జడ్జిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్య లాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధులిక, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, జనరల్ సెక్రటరీ కె.రవీందర్, న్యాయవాదులు నర్సిరెడ్డి, రంగోజు భిక్షపతి, వినయ్ కుమార్, మేకల మహేందర్, సునీల్ కుమార్, సుధాకర్, బానోతు స్వామిదాస్, రాజ్‌కుమార్, రాజేందర్, మేకల అశోక్, మానస, అర్చన, విజయ్ కుమార్, దిలీప్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


