‘రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘రైస్‌మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

Mar 29 2026 7:13 AM | Updated on Mar 29 2026 7:13 AM

ములుగు: రైస్‌ మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ దివాకరను అసోసియేషన్‌ కమిటీ సభ్యులు కలిసి రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ముఖ్యంగా మిల్లింగ్‌, ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకునే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, మిల్లర్స్‌ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు తెలుగు పరాభవ నామసంవత్సర నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement