వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని అమెరికాకు చెందిన బ్రూసీ, సెసీ రోడ్రిగ్‌లు కొనియాడారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వెల్లడించారు. వారి వెంట టూరిజం స్టేట్ గైడ్ సాయినాథ్ ఉన్నారు. అలాగే రష్యా దేశానికి చెందిన ఆసియా, మన దేశానికి చెందిన ఏడ్లూరి నవీన్ దంపతులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా ప్రముఖ కవి శ్రీనివాసచార్య కుటుంబ సమేతంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.


