శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
సీతారాముల కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రామాలయాలు, ఆలయాలు, మండపాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణ తంతు జరిపించారు. జిల్లా కేంద్రంతో పాటు కాశిందేవిపేట, మహ్మద్‌గౌస్‌పల్లి, మల్లంపల్లి, ఇంచర్ల, జగ్గన్నపేట, దేవగిరిపట్నంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మా ర్మోగాయి. మహ్మద్‌గౌస్‌పల్లిలో కులమతాలకు అతీతంగా ముస్లింలు రాములోరి కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. – ములుగు
– మరిన్ని ఫొటోలు 9లోu
జై శ్రీరాం నినాదాలతో మార్మోగిన ఆలయాలు


