గోదావరి పరిరక్షణ యాత్ర | - | Sakshi
Sakshi News home page

గోదావరి పరిరక్షణ యాత్ర

Mar 28 2026 7:17 AM | Updated on Mar 28 2026 7:17 AM

కాళేశ్వరం: గోదావరి పరిరక్షణ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజు శుక్రవారం మహారాష్ట్రలోని పూనాకు చెందిన సద్గురు ఉద్యోగ మహారాజ్‌ శ్రీ క్షేత్ర ఆలంది ఆధ్వర్యంలో బృందం మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం చేరుకుంది. త్రివేణి సంగమం ఘాటు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.

పరిశ్రమలకు ఇంక్యుబేషన్‌..

నిట్‌ వరంగల్‌

కాజీపేట అర్బన్‌: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్‌లా నిట్‌ వరంగల్‌ నిలుస్తుందని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరి యంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్‌ కాన్‌క్లేవ్‌) రీసెర్చ్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ, సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నిట్‌ వరంగల్‌ ఇ న్నోవేషన్‌ సెంటర్‌ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్‌, ఇన్నోవేషన్‌, ఏఐ ఎగ్జిబిట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ అడ్వైజర్‌ వినాయక్‌ మరాఠే పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement