బాలికల విద్యకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలికల విద్యకు భరోసా

Mar 27 2026 9:26 AM | Updated on Mar 27 2026 9:26 AM

బాలికల విద్యకు భరోసా విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి

వైఐఐఓఈలుగా జిల్లాలో మూడు కేజీబీవీలు ఎంపిక

ములుగు

I

శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026

ములుగు రూరల్‌: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా విద్యాభోదన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు కేజీబీవీ పాఠశాలలను యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(వైఐఐఓఈ)గా గుర్తించింది. ఎక్సలెన్స్‌ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందేందుకు ఎంట్రెన్స్‌ నిర్వహించి అర్హత సాధించిన వి ద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు కల్పించనున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంపికై న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సాధారణ విద్యాబోధనతో పాటు నీట్‌, జేఈఈ, క్లాట్‌ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

వైఐఐఓఈలుగా ఎంపికై న పాఠశాలలు

జిల్లాలో 9 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఎక్సలెన్స్‌ పాఠశాలలుగా వెంకటాపురం(ఎం) కేజీబీవీ పాఠశాలలో బైపీసీ విద్యార్థులకు నీట్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు. అలాగే గోవిందరావుపేట మండలం చల్వాయి కేజీబీవీ పాఠశాలలో ఎంపీసీ, ఐఐటీ, జేఈఈ కోచింగ్‌, ఎస్‌ఎస్‌తాడ్వాయి కేజీబీవీ పాఠశాలలో సీఈసీ, క్లాట్‌ కోచింగ్‌ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఎంపికై న కళాశాలల్లో 40 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు.

ఎంట్రెన్స్‌తోనే అడ్మిషన్లు

వైఐఐఓఈలుగా గుర్తింపు పొందిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో అడ్మిషన్లకు ఏప్రిల్‌ 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 5వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కేజీబీవీ సెక్టోరియల్‌ అధికారులు సూచిస్తున్నారు. కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూప్‌లలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు శని, ఆదివారాలలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు తరగతులు నిర్వహించనున్నారు.

2026–27 విద్యాసంవత్సరంలో వైఐఐఓఈలుగా ఎంపికై న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థినులు ప్రవేశ పరీక్షలు రాయాలి. విద్యార్థినులు ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీ/టీజీఆర్‌జేసీ.జీఓవీ.ఇన్‌ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ప్రతిభ ఆధారంగా విద్యార్థినుల ఎంపిక ఉంటుంది. నీట్‌, జేఈఈ, క్లాట్‌ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేశాం.

– రజిత, జిల్లా కేజీబీవీ సెక్టోరియల్‌ అధికారి

ఇంటర్మీడియట్‌లో చేరేందుకు

ప్రవేశ పరీక్ష తప్పనిసరి

నీట్‌, జేఈఈ, క్లాట్‌ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ

Advertisement
 
Advertisement
Advertisement