మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు చెల్లించాలి

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు చెల్లించాలి

ములుగు: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నులు విధిగా చెల్లిస్తూ మున్సిపల్‌ సిబ్బందికి సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేశ్‌ తెలిపారు. ములుగు పట్ణణంలో మంగళవారం సిబ్బందితో కలిసి పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పన్నులు ప్రధాన ఆదాయ వనరులని తెలిపారు. ఇప్పటి వరకు 54 శాతం పన్నులు వసూలు కాగా బకాయి ఉన్న పన్నులను ఈ నెల 31వ తేదీకి ముందు చెల్లించాలని ప్రజలను కోరారు. తర్వాత చెల్లించే పన్నులపై వడ్డీ విధించబడుతుందని, అదనపు భారాన్ని తప్పించుకోవడానికి గడువులోపే పన్నులు చెల్లించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రాజేందర్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేశ్‌, బిల్‌ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement