మేడారం హుండీ ఆదాయం రూ.88,31,963 | - | Sakshi
Sakshi News home page

మేడారం హుండీ ఆదాయం రూ.88,31,963

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

మేడారం హుండీ ఆదాయం రూ.88,31,963

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల కానుకల హుండీ ఆదాయం రూ.88,31,963 లక్షలు వచ్చిందని ఈఓ వీరస్వామి తెలిపారు. మేడారంలోని ఎండోమెంట్‌ కార్యాలయంలో డార్మెంటరీ భవనంలో సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో మంగళవారం హుండీల లెక్కింపు ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.39,74,504లక్షలు, సారలమ్మ హుండీ ఆదాయం రూ.36,22,256లక్షలు, గోవిందరాజు హుండీ ఆదాయం 2,19,368లక్షలు, పగిడిద్దరాజు హుండీ ఆదాయం 3,44,088లక్షలు, ఈ – హుండీ ఆదాయం 6,71,747లక్షలు కలుపుకుని మొత్తం రూ.88,31,963లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీల లెక్కింపును పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, హుండీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, పూజారులు, సిబ్బంది పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement