ఆదికర్మయోగితో మహర్దశ
జిల్లాలో పథకానికి ఎంపికై న గ్రామాల వివరాలు
రూ.3 కోట్ల వరకు నిధులు
కేంద్రం ప్రవేశపెట్టిన పథకంతో 49 గిరిజన గ్రామాలకు లబ్ధి
వెంకటాపురం(కె) కొండాపురంలో సమస్యను గుర్తిస్తున్న టీం సభ్యులు
ఏటూరునాగారం: గిరిజన గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆదికర్మయోగి అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ఎంపికై న గిరిజన గ్రామాల్లో ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించింది. ఈ మేరకు గిరిజన సాధికారత, ప్రతిస్పందనాత్మక పాలనను బలోపేతం చేయడం, స్థానికులకు నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పథకాన్ని రూపొందించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదేశంతో జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 49 గిరిజన గ్రామాలు ఆదికర్మయోగి పథకానికి ఎంపికయ్యాయి.
నాలుగు నినాదాలతో అభివృద్ధి పనులు
ఈ పథకంలో భాగంగా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్(సేవ, పరిష్కారం, సమర్పణ, నమ్మకం) అనే నాలుగు నినాదాలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గిరిజన సంఘాలు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా విజన్ 2030లో భాగంగా దేశంలో లక్ష గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించారు. ఈ మేరకు జిల్లాలోని 49 గ్రామాలను పథకంలో ఎంపిక చేశారు. వైద్యులు, ఉపాధ్యాయులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ, ఐసీడీఎస్, విద్యుత్‌శాఖ, తదితర శాఖలతో కలిపి ఒక టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం సభ్యులు ఎంపిక చేసిన గ్రామాల్లో వారం రోజుల పాటు తిరిగి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఐటీడీఏ ద్వారా పంపించారు.
49గ్రామాలు.. రూ.35.97కోట్లతో
ప్రతిపాదనలు
ఎనిమిది మండలాల్లో 49 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని జనాభా ప్రకారం నిధుల కేటాయింపు అంచనా వేశారు. మొత్తం 49 గ్రామాలకు గాను రూ. 35.97 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. మరో వారం రోజుల్లో ఈ పనులు ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఐటీడీఏ అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర పరిశీలన కమిటీ కూడా జిల్లాలో పర్యటిస్తోంది.
మండలం గ్రామాల
సంఖ్య
ములుగు 4
ఏటూరునాగారం 2
వెంకటాపురం(కె) 5
ఎస్‌ఎస్ తాడ్వాయి 8
గోవిందరావుపేట 2
వాజేడు 9
మంగపేట 5
కన్నాయిగూడెం 14
జిల్లాలోని 8 మండలాల పరిధిలో 49 గ్రామాలను అధికారులు పథకానికి ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ గ్రామాల్లో టీం సభ్యులు గ్రామసభలను నిర్వహించి వారు గుర్తించిన సమస్యలను ప్రజలకు వివరించారు. వారి నుంచి అభిప్రాయలను సేకరించారు. ఈ సేకరించిన వాటిని ఫైనల్ చేసి కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఒక్కో గ్రామానికి రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు మంజూరు కాగానే పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీన బిర్సాముండా జయంతి సందర్భంగా దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ వారం రోజుల ముందు నుంచి గ్రామాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టబోయే పనులు, గ్రామస్తులకు ఉపయోగ పడే అంశాలను టీం సభ్యులు ప్రజలకు వెల్లడిస్తున్నారు. ఈ సమావేశాలను వారం రోజుల పాటు చేపట్టి ఆ తర్వాత పనులు చేపట్టనున్నట్లు సమాచారం.
ఐదేళ్ల పాటు ఆయా గ్రామాల్లో
అభివృద్ధి పనులు
2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం
ఆదికర్మయోగితో మహర్దశ
ఆదికర్మయోగితో మహర్దశ


