విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ములుగు రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అన్నారు. మండల పరిధిలోని జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం జోనల్‌స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పోటీలకు కాళేశ్వరం జోన్–1 పరిధిలోని 11గురుకుల పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. క్రీడా పోటీల ప్రాంభోత్సవానికి అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సూర్య, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై 11వ జోనల్ స్థాయి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. అనంతరం రవిచందర్, సూర్య, సిద్ధార్థరెడ్డిలు మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్‌ను ప్రారంభించారు. మధ్యాహ్నం వాలీబాల్, కబడ్డీ పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించారు. క్రీడాకారులకు ప్రథమ చికిత్స కోసం పాఠశాల ఆవరణలో డాక్టర్ రాములు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. క్రీడల్లో గాయపడిన విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సందీప్, ములుగు, భూపాలపల్లి డీసీఓలు వెంకటేశ్వర్లు, భిక్షపతి, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, పీడీలు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, సురేశ్‌బాబు, పీఈటీలు చంద్రమౌళి, యాదగిరి రాంచంద్రం, బ్రహ్మచారి, రజిని, సంపత్, ఆనంద్, మమత, పుల్లయ్య, దయానంద్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ
జాకారం గురుకుల పాఠశాలలో
జోనల్‌స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి


