వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌

Nov 7 2025 6:45 AM | Updated on Nov 7 2025 6:45 AM

వన్‌న

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌ రహదారి పనుల్లో నాణ్యత డొల్ల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక ఉద్యోగులకు కౌన్సెలింగ్‌

ములుగు రూరల్‌: వన్‌ నేషన్‌, వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పై ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి వర్క్‌షాపును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్క్‌షాపు కన్వీనర్‌ జగదీశ్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది అధ్యాపకులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలిపారు. వీరికి మొదటి, రెండో విడతలో థియరి అంశాలపై అవగాహన నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు, నాలుగు విడతల్లో కంప్యూటర్‌పై శిక్షణ ఉంటుందని వెల్లడించారు. అనంతరం వర్క్‌షాపు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సుదర్శన్‌రావు, లైబ్రరీ సైన్స్‌ విభాగాధిపతి రాధిక రాణి, బాలయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రం నుంచి జాకారం వెళ్లే జాతీయ రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు ధ్వంసమైంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ జాతీయ రహదారిపై బీటీ రెండో కోటింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టి వారం రోజులు గడవక ముందే రోడ్డు ధ్వంసమైంది. ఒక పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క రోడ్డు పగుళ్లు ఏర్పడడంతో వాహనదారులు అసహనానికి గురవుతున్నారు.

ఏటూరునాగారం: జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ఏటూరునాగారం డిగ్రీ బాలికల గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారిని పిన్సిపాల్‌తో పాటు కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా కళాశాలకు చెందిన మేఘన, కీర్తనలు పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని తెలిపారు. నేటి నుంచి పెద్దపల్లి జిల్లాలో 56వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం కాగా పోటీలకు తరలివెళ్లినట్లు తెలిపారు. కళాశాల పీడీ అరుణ విద్యార్థులకు ప్రతిరోజూ క్రీడలను నిర్వహించడంతో విద్యార్థులు సులువుగా గెలుపొందారని వివరించారు. అదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో ఆడి విజయం సాధించాలని కోరారు.

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని కేటీకే 5వ గనిలో తక్కువ మస్టర్లు చేసిన ఉద్యోగులకు గురువారం గని అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గడిచిన మాసంలో ఉపరితల గనిలో 20, భూగర్భ గనిలో 16 మస్టర్లకు తక్కువ నమోదు చేసిన ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీకే 1 గ్రూప్‌ ఏజెంట్‌ మాటూరి రవీందర్‌ మాట్లాడారు. గతంలో కనీస మస్టర్లు వంద మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటిని 190కి పెంచినట్లు తెలిపారు. తక్కువ మస్టర్లు చేసిన ఉద్యోగులపై కంపెనీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. దీని ఫలితంగా ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్‌ మాచర్ల రమేష్‌, సంక్షేమ అధికారి సందీప్‌కుమార్‌, సంఘాల నాయకులు తిరుపతి, రాజు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌
1
1/3

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌
2
2/3

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌
3
3/3

వన్‌నేషన్‌, వన్‌సబ్‌స్క్రిప్షన్‌పై వర్క్‌షాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement