
ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ
ములుగు రూరల్: ఏజెన్సీ గ్రామాల్లో శనివారం ఎన్టీపీసీ దక్షిణ విభాగం వారి సహకారంతో దోమతెరల పంపిణీని చేపట్టారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని సర్వాపూర్, అంకన్నగూడెం, పెగడపల్లి పంచాయతీల్లో వెయ్యి కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ చీఫ్ జనరల్ పాణిగ్రాహి, లయన్స్‌క్లబ్ ఫౌండేషన్ ఏరియా లీడర్ దీపక్‌భట్టాచార్జి, లయన్స్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ చీఫ్ జనరల్ పాణిగ్రాహి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనందిస్తున్నామన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సామాజిక సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎజీఎం అఖిల్ పట్నాయక్, లయన్స్ 320 ఎఫ్ వైస్ గవర్నర్లు సుధాకర్‌రెడ్డి, హరికిషన్, వివేకనందపురం క్లబ్ ప్రెసిడెంట్ నరేష్‌చంద్రదాస్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ములుగు క్లబ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రకాశం, పద్మజాదేవి, తదితరులు పాల్గొన్నారు.