
రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి..
ములుగు ఏరియా ఆస్పత్రికి రెండు రోజు క్రితం జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రెండు రోజులు ఐసీయూలో ఉచిత వైద్యం అందించారు. బుధవారం డాక్టర్ వైద్య పరీక్షలు చేయించాలని రాశారు. షాంపిల్ ఇచ్చిన ఇంకా రిపోర్టు రాలేదు. ల్యాబ్‌కు వెళ్లి అడిగితే ఇంకా రాలేదు అని చెబుతున్నారు. వైద్యులు రిపోర్టులు వచ్చాక నిర్ధారించి చెపుతామని అంటున్నారు. సకాలంలో రిపోర్టులు అందించాలి.
– జంగిడి ప్రకాశ్, గోవిందరావుపేట
జ్వరం తగ్గకపోవడంతో ములుగు ఏరియా ఆస్పత్రిలో చేరాను. ఇంటి వద్ద జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ దగ్గర మూడు రోజులు ఇన్‌జెక్షన్లు వేయించుకున్నా తగ్గలేదు. ఆస్పత్రిలో చేరి ఆరు రోజులు అవుతుంది. వైరల్ ఫీవర్ అంటున్నారు. పొద్దున, సాయంత్రం డాక్టర్ వచ్చి చూసి గ్లూకోజ్‌లు, సూదులు రాస్తున్నాడు.
– హర్షం సారయ్య, నారాయణపురం,
వెంకటాపురం(ఎం) మండలం
నా భర్తను నాలుగు రోజుల క్రితం దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఇక్కడ అడ్మిట్ చేసుకొని వైద్యం చేశారు. జ్వరం తగ్గింది కాని దగ్గు ఇంకా తగ్గలేదు.
– బుర్రి లక్ష్మీ, నిజాంపల్లి,
గోరికొత్తపల్లి మండలం
ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పత్రిలో 13 రకాల ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో మలేరియా, వైరల్ ఫీవర్‌తో రోగులు ఎక్కువగా వస్తున్నారు. జ్వరపీడితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నాం. ఆస్పత్రిలో రోగులకు సరిపడా బెడ్లు, అందుబాటులో ఉన్నాయి.
– చంద్రశేఖర్,
ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు

రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి..

రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి..

రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి..