
సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: సమాచార హక్కు చట్టం –2005పై అధికారులు తప్పనిసరిగా పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, డిప్యూటీ కలెక్టర్ కుశీల్ వంశీ పాల్గొన్నారు. అనంతరం సమాచార హక్కుచట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏఓ రాజ్‌కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీసీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ