
మద్యం టెండర్ల ప్రక్రియ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో జరుగుతున్న మద్యం టెండర్ల దరఖాస్తు ప్రక్రియను బుధవారం వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సులభతర దరఖాస్తు విధానం అమలు చేయాలన్నారు. అభ్యర్థులకు కావాల్సిన దరఖాస్తు ఫారాలు అందుబాటు ఉంచాలన్నారు. దరఖాస్తుదారులకు మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని స్టేషన్ల ఎకై ్సజ్ సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.