
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
ములుగు రూరల్: నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ దేవరాజ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 5 జెడ్పీటీసీ, 30 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయని వివరించారు. జిల్లాలో మొదటి విడతలో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి దివాకర టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ధాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో సందేహాలను ఉన్నతాధికారుల నుంచి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర