
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రదేశాలపై విస్తృత ప్రచారం కల్పిస్తూ రాబోయే భావితరాలకు వారసత్వ సంపదను అందించాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ.పాపారావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయం ఆవరణలో ప్రపంచ వారసత్వ వలంటీర్ల శిబిరాన్ని ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావుతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపారావు ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి వలంటీర్లకు వివరించారు. ప్రపంచ, దేశ, రాష్ట్రస్థాయిలో వారసత్వ సంపద మూడు దశలలో ఉంటుందని వెల్లడించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వారసత్వ సంపదను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. రామప్పలో నాలుగేళ్లుగా వలంటీర్ల శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. 10 రోజుల పాటు కొనసాగనున్న వలంటీర్ల క్యాంపునకు దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 36 మంది వలంటీర్లు, ఇరాన్ దేశానికి చెందిన ముగ్గురు విదేశీయులు వలంటీర్లుగా వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ డిప్యూటీ ఆర్కియాలజిస్ట్ కేఆర్ దేశాయ్, క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాపారావు
రామప్పలో ప్రపంచ వారసత్వ
వలంటీర్ల శిబిరం ప్రారంభం

వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి