
వైభవంగా శోభాయాత్ర
● ముగిసిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
ఏటూరునాగారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. దీంతో నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గాదేవి ప్రతిమలను మండపాల నిర్వహకులు శోభాయాత్రగా వైభవంగా గోదావరిలో నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లారు. శనివారం రామాలయంలోని దుర్గాదేవిని ప్రత్యేక రథంలో అలంకరించి కోలాటంతో అమ్మవారిని సాగనంపారు. అమ్మవారికి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలను కొట్టారు. రామాలయంలో నూతనంగా రథాన్ని తయారు చేయించగా దాంట్లో అమ్మవారి ప్రతిమను పెట్టి తాళ్లతో భవాని మాలధారులు లాగుతూ తీసుకెళ్లారు. అదేవిధంగా స్టార్‌యూత్, శివాలయం, ముత్యాలమ్మ వీధి, క్రాస్‌రోడ్డు లోని అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా సాగనంపారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రతిమలను ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. దీంతో దుర్గాదేవి నవరాత్రులు ప్రశాంతంగా ముగిసాయి.

వైభవంగా శోభాయాత్ర