
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క
ములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యే యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద కుటుంబాలకు 200 యూని ట్లు ఉచిత కరెంట్, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అని కొని యాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య పాల్గొన్నారు.