
స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలి
● జిల్లా అధ్యక్షుడు బలరాం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయాన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలను ప్రజలకు వివరిస్తూ మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి
ఏటూరునాగారం: రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు వినుకొల్లా చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో బలరాం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మరోసారి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలని అన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జవహర్ లాల్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి రామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు భర్తపురం నరేష్, జినుకల కృష్ణ్కార్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జవహర్‌లాల్, నాయకులు మల్లెల రాంబాబు, జంగా హన్మంతరెడ్డి, సిద్దబోయిన సురేందర్, మాదరి శ్రీకాంత్, సలేందర్, చెంగల సుభాష్, భర్తపురం నరేష్, మహాలక్ష్మి, సత్యం, జనార్దన్, హరిబాబు, ఎల్లయ్య, సంపత్, రాజశేఖర్, శ్రీనువాస్, ప్రేమలత, జగన్ పాల్గొన్నారు.