
మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ములుగు రూరల్/ఏటూరునాగారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మండపానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రామాలయంలోని అమ్మవారు భక్తులకు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భవాని స్వాములు దుర్గామాత శరణుఘోష చెబుతూ పాటలు పాడారు. మహానైవేధ్యాన్ని సమర్పించారు. అలాగే స్టార్ యూత్, క్రాస్‌రోడ్డు, సాయిబాబా దేవాలయంలో కూడా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశారు.
బలిహరణ కార్యక్రమం
మండల కేంద్రంలోని రామాలయంలో బలిహరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావు శర్మ చేపట్టారు. భవాని స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయం చుట్టూ అష్టదిక్కుల పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి గుమ్మడికాయలతో పూజలు చేశారు. అలాగే స్టార్‌యూత్ ఆధ్వర్యంలోని భవాని స్వాములు, అర్చకులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి ర్యాలీగా దుర్గాదేవి మండపానికి తరలివెళ్లి పూజలు చేశారు.
ఏటూరునాగారంలోని
రామాలయంలో..
ములుగులో మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు

మహిషాసుర మర్దినిగా అమ్మవారు