
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని మూర్కులు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ కోసం కష్టపడ్డవారికి అవకాశాలు వస్తాయని పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, ఇస్సార్‌ఖాన్, నారాయణరెడ్డి, చాంద్ పాషా, సారయ్య, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క