న్యూ టెక్నాలజీ | - | Sakshi
Sakshi News home page

న్యూ టెక్నాలజీ

Sep 29 2025 8:43 AM | Updated on Sep 29 2025 8:43 AM

న్యూ

న్యూ టెక్నాలజీ

ఐటీఐలకు అనుసంధానంగా అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్‌

ఏటూరునాగారం: ఐటీఐలకు అనుసంధానంగా అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్‌ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. టాటా కంపెనీ వారి సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఐటీఐలోని ఆరు ట్రేడ్‌లతో పాటు అడ్వాన్స్‌ ్డ టెక్నాలజీని నిరుద్యోగ, విద్యార్థులకు అందించనుంది. కేవలం కొన్ని ట్రేడ్‌లతో శిక్షణ తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని ప్రభుత్వం ఏటీసీలను నెలకొల్పింది. తెలంగాణ ప్రభుత్వం పాత ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చింది. అందులో భాగంగా జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడులో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ ఏడాదికి గాను అడ్మిషన్లు స్వీకరించి ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు.

మూడు కోర్సులకు ఏడాది..

మూడు కోర్సులకు రెండేళ్లు..

మొత్తం ఆరు కోర్సులు నూతనంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాగా అందులో మూడు కోర్సులకు ఏడాది పాటు చదివేలా ప్రవేశపెట్టారు. మరో మూడు కోర్సులను రెండేళ్ల పాటు కాలపరిమితిని అధికారులు నిర్ణయించారు. ఐటీఐ ఒక్క సెంటర్‌కు 172 సీట్లను కేటాయించారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు టెన్త్‌ పూర్తి చేసుకున్న వారు అర్హులు. ఈ కోర్సులను పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా దక్కే అవకాశం ఉంది. రోబోతోనే అన్ని కోర్సులను నేర్పించనున్నారు. రోబోటిక్‌ పూర్తిగా మరో 50 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే టెక్నాలజీలను ఇప్పుడు ప్రవేశపెట్టారు.

ఏటీసీ సెంటర్లు ప్రారంభం

వాజేడులోని ఏటీసీ సెంటర్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ ప్రారంభించగా ఏటూరునాగారంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలోనే అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను స్థానిక ఏపీఓ వసంతరావు ఈనెల 27న ప్రారంభించారు. ఇదే రోజు హైదరాబాద్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ఆరు కొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. టాటా కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టారు. శిక్షణ ఏడాది, రెండేళ్ల కోర్సులు ఉండడంతో శిక్షణ తర్వాత ఉపాధి కూడా కల్పించే విధంగా ఏటీసీ సెంటర్లను రూపొందించారు.

నూతనంగా ఆరు కోర్సులు

ఆరు ట్రేడ్‌లతో విద్యార్థులకు శిక్షణ

టాటా కన్సల్టెన్సీ సౌజన్యంతో ఉద్యోగ అవకాశాలు

మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రెండు సంవత్సరాల కోర్సు.. 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

బేసిక్‌ డిజైనర్‌, వర్చువల్‌ వెరిఫయర్‌, అడ్వాన్స్‌ ్డ సీఎస్‌సీ టెక్నీషియన్‌ కోర్సుకు 24 సీట్లను కేటాయించారు.

అర్టిజన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌ ్డ టూల్స్‌ కోర్సు.. ఏడాది పాటు కోర్సు 20 సీట్లను కేటాయించారు.

మాన్యుఫ్యాక్చర్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌ ఏడాది కోర్సు ఉండగా 40 సీట్లను కేటాయించారు.

ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌ కోర్సు ఏడాది పాటు కోర్సు ఉండగా 40 సీట్లు కేటాయించారు.

అడ్వాన్స్డ్‌ ఎనిమేషన్‌ రోబోటిక్‌ టెక్నాలజీ రెండు సంవత్సరాల కోర్సు ఉండగా 24 సీట్లను కేటాయించారు.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

నూతనంగా ప్రవేశపెట్టిన ఆరు కోర్సుల్లో చేరితే భవిష్యత్‌ బాగుంటుంది. శిక్షణతో పాటు ఉపాధి సైతం లభిస్తుంది. రాబోయే తరాలకు ఉపయోగ పడేలా కోర్సులను ప్రారంభించాం. వీటితో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది. పాత ఐటీఐ సెంటర్లలోనే అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం నెలకొల్పింది. టాటా కన్సల్టెన్సీ సౌజన్యంతో ఈ నూతన ఒరవడిని ప్రవేశపెట్టింది. భవిష్యత్‌లో ఈ కోర్సులు నేర్చుకునేందుకు విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంది.

– జగన్‌ మోహన్‌రెడ్డి, ఐటీఐ ఏటూరునాగారం కళాశాల ప్రిన్సిపాల్‌

న్యూ టెక్నాలజీ1
1/2

న్యూ టెక్నాలజీ

న్యూ టెక్నాలజీ2
2/2

న్యూ టెక్నాలజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement