
ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
గోవిందరావుపేట: మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈఎన్‌టీ వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య మహిళా శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, టీబీ ఈఎన్‌టీ, కేన్సర్, డెంటల్ వైద్య నిపుణులచే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 65 మహిళా ఆరోగ్య వైద్య శిబిరాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 21,530 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 1,400 మంది పిల్లలు, 3,300 మంది గర్భినులు, బాలింతలు, 800 మంది కిశోర బాలికలు ఉన్నారన్నారు. గోవిందరావుపేట పీహెచ్‌సీలో నిర్వహించిన ఈఎన్‌టీ శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేశామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ నిపుణుడు డాక్టర్ హర్షవర్ధన్, ఆయూష్ వైద్యురాలు అనూష, డెమో సంపత్, సూపర్‌వైజర్ శ్యామల, స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
పూల పండుగ బతుకమ్మ
మంగపేట: పూల పండుగ బతుకమ్మ అని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో వైద్యాధికారి స్వప్నిత ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, గోవిందరావుపేట మెడికలాఫీసర్ చంద్రకాంత్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు.