
స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు రూరల్: నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల పాఠశాలల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ప్రకటించిన నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు ఎన్నికల నిర్వాహణపై అవగాహన కలిగి ఉండి సమన్వయంతో ముందుకు సా గాలన్నారు. ఇబ్బందులు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఎ న్నికల సమయంలో పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మాస్టర్ ట్రైనర్లు సూర్యనారాయణ, మధుసూదన్, రాజేష్‌కుమార్, రవీందర్, శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, రమేష్, సతీష్, మహేందర్, అధికారులు పాల్గొన్నారు.