
వైన్స్ దరఖాస్తులకు వేళాయె..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వైన్స్ ఇలా..
నేటి నుంచి అర్జీల స్వీకరణ
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన చేసింది. గత మద్యం పాలసీలో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ నిర్ణయించగా.. ఈ సారి నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో ఖజానాకు వైన్స్ కిక్కు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో 294 వైన్స్‌లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్ షాపులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో స్వీకరించనున్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్‌తోపాటు సీఐ, ఎస్సై సిబ్బంది దరఖాస్తులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు. రూ.3 లక్షల డీడీ లేదా చెక్కు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతోపాటు రిజర్వేషన్ల ప్రకారం కులధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్‌లను జతపరిచి దరఖాస్తులు అందజేయాలి.
అక్టోబర్ 18వరకు దరఖాస్తుల స్వీకరణ..
వైన్స్‌షాపులను కేటాయించేందుకు అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు వైన్‌షాపులు కేటాయిస్తారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో కేటాయించిన రుసుమును చెల్లించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన వైన్‌షాపులు ప్రారంభిస్తారు.
రిజర్వేషన్లు ఇలా...
వైన్స్ కేటాయింపులో కులాల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. గౌడలకు 10 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్ల ప్రాతిపదిన కేటాయించిన వైన్స్‌లను గురువారం ఎంపిక చేశారు. కాగా, జిల్లాలోని 67 షాపులు గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఒక షాపు కేటాయించారు.
గత పాలసీ రిపీట్...
గత పాలసీలో గడువు ఉన్న వైన్స్‌ల టెండర్లను మూడు నెలల ముందే ప్రకటించగా.. ఈ సారి అదేపాలసీ రిపీట్ అయ్యింది. డిసెంబర్ 2025 వరకు వైన్స్ గడువు ఉన్నప్పటికీ మూడు నెలల ముందే టెండర్లను ప్రకటించి గత పాలసీ సీన్‌ను రిపీట్ చేసింది.
రూరల్ నుంచి అర్బన్‌లోకి రెండు వైన్స్..
వరంగల్ రూరల్ జిల్లాలోని రెండు వైన్స్‌లు వరంగల్ అర్బన్ జిల్లాకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో భాగంగా కేటాయించారు. దీంతో వరంగల్ అర్బన్‌లో గతంలో 65 వైన్స్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 67కు చేరింది. అదేవిధంగా వరంగల్ రూరల్‌లో 63 వైన్స్ ఉండగా 61కి చేరింది.
వరంగల్ అర్బన్ 67
వరంగల్ రూరల్ 61
మహబూబాబాద్ 59
జనగామ 47
భూపాలపల్లి ములుగు 60
ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు
అక్టోబర్ 23న లక్కీ డ్రా.. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ