
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని అమెరికాకు చెందిన లెవ్ కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఆయన గురువారం సందర్శించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని ఆయన పేర్కొన్నారు.
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌గా దబ్బకట్ల జనార్దన్ గురువా రం బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు డీడీగా పనిచేసిన పోచం కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. మంచిర్యాలలో డీటీడీఓగా పనిచేసిన జనార్దన్ పదోన్నతిపై ఏటూరునాగారంకు బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అనంతరం పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, కాక భాస్కర్, మైనర్‌బాబు, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర కమిటీ కోశాధికారి గుండబోయిన చంద్రయ్య అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా అందించకపోవడంతో నానాపా ట్లు పడుతున్నారన్నారు. అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాస రాజన్న, వెంకన్న, శ్రీనాథ రవి, సంజీవయ్య, సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని నేడు ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ వర్గాలకు సంబంధించిన వారితో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్

రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్