
పాతాళగంగ ౖపైపెకి..
● చేతి పంపు నుంచి ఉబికి వస్తున్న నీరు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి– మేడారం మార్గంలోని రోడ్డుకు కొద్ది దూరంలో అడవిలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. మేడారానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ చేతి పంపు ఉంది. మేడారానికి వచ్చిన భక్తులు అడవి ప్రాంతంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకునేందుకు చేతి పంపు నీటితో అవసరాలను తీర్చుకుంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుడడంతో భూగర్భజలాలు పెరిగి చేతి పంపు నుంచి పాతాళగంగ వ్యవసాయ బోరు మోటారు పోసినట్లుగా ఉబికి వస్తుడడంతో మేడారానికి వచ్చిన భక్తులు, దారిగుండా వెళ్లే వాహనాదారులు అక్కడ కొద్ది సేపు వాహనాలను నిలిపి చూసి వెళ్తున్నారు.