
అన్నపూర్ణదేవిగా దుర్గామాత
ములుగు: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గామాత అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ దంపతులు పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ యువజన నాయకుడు సిద్ధం రాఘవేందర్ దంపతులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, వెంకటాపురం ఉత్సవ కమిటీ చైర్మన్ ముప్పు పూర్ణేందర్, సభ్యులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు