
27న కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: ఈ నెల 27న కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను అన్ని సామాజిక వర్గాల మహిళలు ఒక్కటిగా జరుపుకోవడం ప్రత్యేకమన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని పండుగ వైభవాన్ని చాటాలని సూచించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌రావు, ఉపాధ్యక్షురాలు శిరీష, కందుల జీవన్‌కుమార్, రామకృష్ణ, రఫిక్, శైలజ, నాగశ్రీ, భగవత్‌గీత, అనంతలక్ష్మి, రమాదేవి, కావ్య తదితరులు పాల్గొన్నారు.