
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ దోర్నాల రాజేందర్ ఆధ్వర్యంలో వికలాంగులు, చేయూత పింఛన్‌దారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు, చేయూత పింఛన్‌దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలన్నారు. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు కోసం పింఛన్‌దారులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ శ్యాంబాబు, నాయకులు అంబాల చంద్రమౌళి, శ్రీనివాస్, తిరుపతి, ఎర్ర భద్రయ్య పాల్గొన్నారు.