
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు
● వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చినట్లు అర్చకులు ముడుంబై రఘునాథచార్యులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భవాని మాలలు ధరించిన స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి ఊరేగింపుగా అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
– ములుగు