
యూరియా కష్టాలు..
● క్యూలో చెప్పులు, ఖాళీ మద్యం సీసాలు
ములుగు రూరల్: రైతన్నలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో చెప్పులను ఉంచడంతో పాటు కొంత మంది ఖాళీ మద్యం సీసాలను ఉంచారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా టోకెన్లు అందిస్తున్న సమాచారం తెలుసుకున్న ములుగు పరిసర ప్రాంతాల రైతులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి టోకెన్ల కోసం వేచి ఉన్నారు. రైతుల సాగు చేసిన పంటలకు అనుగుణంగా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

యూరియా కష్టాలు..