
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
● బిల్లులు లేకుండా విక్రయాలు
● ఎరువుల దుకాణం లైసెన్స్ సస్పెన్షన్
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రోస్ ఎరువులమందు దుకాణం నుంచి కాటారం మండలం దామెరకుంటకు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై కె పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రోస్ ఎరువుల మందుల దుకాణం గుండా దామెరకుంటకు 27 బస్తాలు ట్రాక్టర్‌లో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.
బిల్లులు లేవు..దుకాణం సస్పెన్షన్
అగ్రోస్ ఎరువుల దుకాణంలో మహదేవపూర్ మండలం వ్యవసాయఽ అధికారి సుప్రజ్యోతి సోమవారం తనిఖీ చేపట్టారు. కాటారం మండలం దామెరకుంటకు ట్రాక్టర్‌లో తరలిస్తూ పట్టుబడ్డ 27 యూరియా బస్తాల్లో 21 బస్తాలకు బిల్లులు ఉన్నాయన్నారు. మిగితా ఆరు యూరియా బస్తాలను ముగ్గురు రైతులకు బిల్లులు లేకుండా విక్రయాలు జరిపినట్లు తేలినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డులు స్వాఽ దీనం చేసుకొని సస్పెన్షన్ చేసినట్లు వెల్లడించారు.