
రహదారుల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలి
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు రూరల్: జాతీయ రహదారుల నిర్మానానికి అవసరమయ్యే భూసేకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌లు హాజరయ్యారు. దసరా పండుగకు ముందు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబందించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల పరిహారం మొత్తం డిపాజిట్ చేసి భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని వివరించారు..