
ప్రజా సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరుతుందని తెలిపారు. విదేశీ వస్తువులపై ఆధార పడకుండా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, మేకిన్ ఇండియా ద్వారానే దేశం శక్తివంతం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూప, రవీంద్రాచారి, వెంకట్, కృష్ణాకర్ రావు, రాజ్ కుమార్ పాల్గొన్నారు.