
ఎంగిలిపూల సంబురం
అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు ఉదయం నుంచే తీరొక్క పూలను సేకరించి తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, ఆట స్థలాల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.., బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. దీంతో ఆయా ప్రాంతాలు పాటలతో మారుమోగాయి. జిల్లాకేంద్రంలోని శివాలయానికి మహిళలు బతకమ్మలతో చేరుకొని ఆడిపాడారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకుని సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
– ములుగు రూరల్

ఎంగిలిపూల సంబురం