
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
వెంకటాపురం(ఎం): అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా చిన్నారులు, గిర్భణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుందని ఐసీడీఎస్ ములుగు సీడీపీఓ శిరీష తెలిపారు. మండల పరిధిలోని నర్సాపూర్, అడవి రంగాపూర్ అంగన్‌వాడీ కేంద్రాలలో మంగళవారం పోషణమాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి గర్భిణులు, బాలింతలకు వివరించారు. స్థానికంగా ఉన్న ఆహార పదార్ధాలతో సైతం పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సెక్టార్ సూపర్‌వైజర్ కళావతి, ములుగు డీసీ మమత, బ్లాక్ కోఆర్డినేటర్ వెంకటరాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సీడీపీఓ శిరీష