
పెరుగుతున్న గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న బ్యారేజీల నుంచి వస్తున్న వర్షాలతో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీకి ఎగువన ఉన్న అన్నారం, సరస్వతీ, లక్ష్మీ బ్యారేజీల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,13,540 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని వదులుతున్నారు. ప్రస్తు తం బ్యారేజీ వద్ద 80 మీటర్ల నీటిమట్టం ఉంది.
సమ్మక్కసాగర్‌లోకి
5,13,540 క్యూసెక్కుల నీటి ప్రవాహం
59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీరు