
దేవీ శరన్నవరాత్రులకు మండపాలు ముస్తాబు
ఏటూరునాగారం: మండల పరిధిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులను నిర్వహించేందుకు ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకలకు మండపాలను ముస్తాబు చేశారు. అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకువచ్చేందుకు డీజేలు, ప్రత్యేక రథాలను సిద్ధం చేశారు. భవాని మాలలు ధరించే స్వాములు సైతం భద్రకాళి దేవాలయం చేరుకొని మాలలను ధరించారు. అలాగే స్టార్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి కోసం ప్రత్యేక డిజైన్లతో మండపాలను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి అక్టోబర్ 2 వరకు వేడుకలు

దేవీ శరన్నవరాత్రులకు మండపాలు ముస్తాబు