
అసత్య ప్రచారాలు సరికాదు
ములుగు రూరల్: లంబాడీలను వలసవాదులని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో భూక్య అమర్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లంబాడీలతో కలిసి అభివాదం తెలిపిన అనంతరం సీతారాంనాయక్ మాట్లాడారు. రాజకీయ నాయకులు పబ్బం గడుపుకునేందుకు లంబాడీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పది మండలాల్లో లంబాడీలను కలుపుకొని భవిష్యత్‌లో జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీలతో పాటు భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. లంబాడీలు ఐకమత్యంతో ఉండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా నుంచి తొలగిస్తారని వస్తున్న వదంతులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం అడ్‌హక్ కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భూక్య అమర్‌సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా లకావత్ నర్సింహ, కోశాధికారి కుమార్ పాడ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక గోవింద్‌నాయక్ , భూక్య జంపన్న, కొర్ర రాజు, దేవానాయక్, ప్రశాంత్, మూడ్ రాజా, బాలునాయక్, సర్వన్ కుమార్, సదర్‌లాల్, బబ్లూ, చందులాల్, జగన్‌నాయక్, వినోద్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్