
‘ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి’
ములుగు రూరల్: ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి గోపు జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ఓసీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓసీలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు. ఉద్యమాల ద్వారానే ఓసీ హక్కులను సాధించుకోవాలని సూచించారు. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను తొలగించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య కుల సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణను వచ్చేనెల రెండోవారంలో వరంగల్‌లో నిర్వహించే సదస్సులో ప్రకటిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ పిచ్చిరెడ్డి, కొమురవెల్లి రమేష్, సతీష్‌రెడ్డి, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, వెల్పూరి సత్యనారాయణరావు, రవిరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీష్‌కుమార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.