
జీఓ 64ను రద్దు చేయాలి
ఏటూరునాగారం: హాస్టల్ వర్కర్ల 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, జీఓనంబర్ 64 రద్దు చేయాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని 8వ రోజు శుక్రవారం జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ దావూద్, రత్నం రాజేందర్‌లు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ కాంటినిజెంట్ పేర్లతో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయన్నారు. ఆరు నెలలుగా వేతనాలను చెల్లించకపోతే కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలన్నారు. పెండింగ్ వేతనాలను కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. అంతకుముందు పోలీసులు నిరసనకారులను దోసివేశారు. దీంతో ఐటీడీఏ లోపలి గేటు ఎదుట బైఠాంయించిన నినాదాలు చేశారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గెజిట్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగలక్ష్మీ, భాగ్యలక్ష్మీ, జయలక్ష్మీ, సుజాత, సారిబాబు, రాజు, విజయలక్ష్మీ, కమల, సమ్మక్క, సత్యవతి, ఇందిర, రాజమ్మ, నాగమణి, సుమలత, రాఘువులు, నందం, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్