
తక్కువ తూకంతో విక్రయిస్తే కేసులు
● లీగల్ మెట్రాలజీ శ్రీలత
ములుగు: వ్యాపారులు తక్కువ తూకంతో వినియోగదారులకు మాంసాహారాన్ని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్ మెట్రాలజీ తనిఖీ అధికారి శ్రీలత వ్యాపారులను హెచ్చరించారు. ములుగు మార్కెట్ ప్రాంగణంలోని చేపలు, చికెన్, మటన్ షాపులను ఆమె బుధవారం తనిఖీ చేశారు. అమ్మకందారులు తక్కువ బరువున్న రాళ్లను వాడుతుండటంతో కిలోకు 200 గ్రాములు తక్కువ తూకం వస్తున్నట్లు తనిఖీలో తేలిందన్నారు. వినియోగదారులకు సరైన తూకం వేసి ఇవ్వాలన్నారు.