ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఎగురవేసి మాట్లాడారు. ప్రజలు నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవం అన్నారు. ప్రతీ తెలంగాణవాది విమోచన దినోత్సవాన్ని గర్వంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూ ప, రవీంద్రచారి, జాడి వెంకట్, కృష్ణారావు, శోభన్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కన్నాయిగూడెం: ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటలెక్చువల్స్ కో ఆర్డినేటర్‌గా మండల పరిధిలోని చింతగూడెంకు చెందిన గొస్కుల సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంటలెక్చువల్స్ సమావేశంలో రాష్ట్ర కమిటీ సుధాకర్‌ను ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందించింది.
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్‌గా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్ స్లావిక్ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింంది. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్‌నాయక్ (42) జవహర్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్‌లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి కేయూ జంక్షన్ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్‌నాయక్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాటారం: దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తానని పుట్ట మధు బెదిరింపులకు గురి చేస్తున్నారని, దీనిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సహిస్తున్నారని మండల కేంద్రానికి చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాడి మహేశ్వరీ బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కమాన్‌పూర్ మండలంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పుట్ట మధు తన అనుచరులతో సమావేశం పెట్టి త్వరలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం జరుగుతుందని శ్రీపాదరావు విగ్రహాలను తొలిగిస్తామని భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారన్నారు. విగ్రహాల రక్షణపై అనుమానం ఉందని, శ్రీపాదరావు విగ్రహాలకు ఏదైన జరిగితే పుట్ట మధు ప్రమేయంతోనే అన్నారు.
ములుగులో జాతీయ జెండావిష్కరణ
ములుగులో జాతీయ జెండావిష్కరణ
ములుగులో జాతీయ జెండావిష్కరణ