
పెరుగుతున్న గోదావరి
వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 14.84 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద క్రమంగా పెరుగుతుండడంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చితోటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. పూసూరు, ఏడ్జెర్లపల్లి గ్రామాల మధ్యన బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది.
సమ్మక్క సాగర్‌కు 5,93,830 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: గోదావరికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి వరద భారీగా వచ్చి చేరుతోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,93,830 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అధికారులు 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
నీటిలోనే మిర్చి చేలు

పెరుగుతున్న గోదావరి

పెరుగుతున్న గోదావరి