
సాయుధ పోరాట చరిత్ర ఎర్రజెండాదే..
ములుగు: తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండాదేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఎం ములుగు మండల బాధ్యుడు రత్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం సభ నిర్వహించారు. 4 వేల మంది ప్రాణత్యాగాలతో లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూ స్వాములను గ్రామాల నుంచి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి ప్రజాపాలనను ప్రజలకు చూపించింది కమ్యూనిస్టులని వెల్లడించారు. ఈ సభలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రత్నం రాజేందర్, వెంకటాపురం మండల కార్యదర్శి అలువాల ఐలయ్య, నాయకులు రెడ్డి రామస్వామి, రవిగౌడ్, చందర్, దేవేందర్, రవీందర్, చంటి, వెంకటేశ్, కుమారస్వామి పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
వెంకటరెడ్డి